జిల్లాలో బిఆర్ ఎస్ లో ఎంబిసిలకు మొండి చెయ్యేనా 

జిల్లాలో బిఆర్ ఎస్ లో ఎంబిసిలకు మొండి చెయ్యేనా 
  • లక్షతో సరిపెట్టుకుని.. రాజకీయా లక్ష్యానికి దూరమేనా ?
  • జగిత్యాల మున్సిపల్ లో చైర్ పర్సన్ ఎన్నికకు గోవా క్యాంపుతో తెర పడేనా ...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో బిసిలలోని అణగారిన వర్గాలకు బిఆర్ఎస్ పార్టి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో సరైన ప్రాతినిద్యం ఇవ్వడంలేదని ఆ వర్గాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వెనుక బడిన వర్గాలను ముందుకు తీసుకేలేందుకు పాటుపడిన నాయకుల విగ్రహాలు పెట్టేందుకు బిఆర్ ఎస్ పార్టీ  పోటి పడుతుంది. అట్టడుగు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సి కవిత తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన జ్యోతి రావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ మధ్యనే ఉద్యమం చేపట్టారు. కాని బిఆర్ ఎస్ నాయాకుల తీరు  విగ్రహాల ఏర్పాటు వరకే కాని క్షేత్ర స్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.  గతంలో బిఆర్ ఎస్ ప్రభుత్వం మోస్ట్ బ్యాక్ వార్డ్ క్లాసెస్ వర్గాలకు రూ. లక్ష  ఆర్థిక సహాయం చేసింది ... మీరు ఈ రూ. లక్షతో సరిపెట్టుకోవాలి తప్ప .. రాజకీయాలలో రాణించకూడదు అన్నట్లుగా ఉంది వారి అభిప్రాయం. అంతే మీ సామజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నవి అనే ఆలోచన దొరనితోనే రాజయకియ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీంతో రిజర్వేషన్లు తిసుకోచ్చినప్పటికి బిసిలో ఉన్న అణగారిన వర్గాలకు పదవులు అందని ద్రాక్షలాగే ఉంది. 
జగిత్యాల జిల్లాలో  ఐదు మున్సిపల్ చైర్మన్ లు ఉన్నత బిసి వర్గాలకే
జగిత్యాల జిల్లాలో ఉన్న ఐదు మున్సిపల్ అధ్యక్షా స్థానాలను బిఆర్ ఎస్ పార్టి దక్కించుకుంది. సమాజికవర్గాల వారిగా పరిశిలించినట్లు అయితే మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా బిసి డి సామాజిక వర్గం ముదిరాజు కు చెందిన రణవేని సుజాత, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ గా బిసి డి మున్నూరు కాపు సామజిక వర్గానికి చెందిన సంగి సత్తమ్మ, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా బిసి బి గౌడ సామజిక వర్గానికి చెందిన అన్నం లావణ్య, రాయికల్, జగిత్యాల మున్సిపల్ అధ్యక్షులుగా బిసి బి లోని పద్మశాలి సామజిక వర్గానికి చెందిన మోర హన్మండ్లు, బోగ శ్రావణిని  ఎన్నుకున్నారు. అయితే ఇంత వరకు భాగానే ఉన్న గత ఏడాది జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేసి బిజేపీలో చేరడంతో చైర్ పర్సన్ పదవి కోసం పలువురు కౌన్సిల్ సభ్యులు తమ ప్రయత్నాలు వారు చేసుకుంటూ వచ్చారు. బోగ శ్రావణి పద్మశాలి సామజిక వర్గానికి చెందిన మహిళ అయినందున తమ సామజిక వర్గానికే మళ్లి  ఆ పదవిని కట్టబెట్టాలని పద్మశాలి సంఘం నాయకులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అదే సామజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సి ఎల్ రమణ దృష్టికి తీసుకెల్లారు. ఈ మేరకు పద్మశాలి సామజిక వర్గానికి చెందిన అడువాల జ్యోతి లక్ష్మణ్ లు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఓ దశలో అదే సామజిక వర్గానికి చైర్ పర్సన్ పదవి కట్టబెడతారని ప్రచారం కూడా జరిగింది. అయితే బోగ శ్రావణికి చైర్ పర్సన్ ఇచ్చే సమయంలో  సమిండ్ల వాణి శ్రీనివాస్ కూడా పోటి పడగ వారికీ అప్పుడు నచ్చ జెప్పి శ్రావణికి కట్టబెట్టారు. అయితే ఇప్పుడు శ్రావణి రాజీనామాతో చైర్ పర్సన్ పదవి తమకే ఇవ్వాలని వారు కోరగా  ఎమ్మెల్యే వారికి ఓకే చెప్పడంతో 18 మంది కౌన్సిల్ సభ్యులతో గోవా క్యాంపుకు తరలి వెళ్ళారు.
 
అయితే గత ఏడాది కాలంగా చైర్ పర్సన్ పదవి కోసం వల్లేపు రేణుకమొగిలి  కూడా తమ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.  ఎమ్మెల్సి కవితను రేణుక మొగిలిలు కలవగా  చైర్ పర్సన్ పదవి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేను కలువగ నీ ప్రయత్నాలు నీవు చేసుకో అని చెప్పినట్లు సమాచారం . ఈ మేరకు రేణుక మొగిలిలు సహచర కౌన్సిల్ సభ్యులకు కొంత మొత్తం ముట్ట చెప్పి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. తీర చైర్ పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా ఎమ్మెల్యే కౌన్సిల్ సభ్యులతో పాటు పదవికి పోటి పడుతున్న రేణుక మొగిలి, అడువాల జ్యోతి లక్షన్ ల అభిప్రాయలను సేకరించి సమిండ్ల వాణి శ్రీనివాస్ లకు మొగ్గు చూపగా 36 మంది బి ఆర్ ఎస్ కౌన్సిల్ సభ్యులకుగాను  18 మంది కౌన్సిల్ సభ్యలతో గోవా క్యాంపుకు తరలివెళ్ళారు. అయతే జగిత్యాల పట్టణంలో అతి పెద్ద సమాజిక వర్గం అయిన పద్మశాలిలకు పదవి ఇస్తానని ఎమ్మెల్యే మోసం చేశారని ఆ సామజిక వర్గం గుర్రుగా ఉంది. ఇది ఇలా ఉంటె  ఎంబిసిలకు గత  బి ఆర్ ఎస్ ప్రభుత్వం  లక్ష రుణాన్ని ఇచ్చి చేతులు దులుపుకుందని, బిసిలలో అట్టడుగు వర్గాలకు చెందిన ఒడ్డెరులు రాజకీయాలకు పనికరారా అని వారు ప్రశ్నిస్తున్నారు. విగ్రహాలు పెట్టడం కాదని వారి ఆశయాలను అమలు చేయాలని అంటున్నారు. తమ ఒడ్డెర సామజిక వర్గానికి పార్టీ టికెట్ ఇవ్వకున్న స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి ఓసి సామజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఓడించి గెలుపొంధామని .. అదేనా మేం చేసిన తప్పు అని వారు ప్రశ్నిస్తున్నారు. సామజిక వర్గ ఓట్ల కోసం కాకుండా బిసిలలో అణగారిన వర్గాలకు కూడా  రాజకీయ అవకాశం కల్పించాలని, జిల్లాలో ఐదు మున్సిపల్ లలో  బలహీన వర్గాల్లోని  ఉన్నత వర్గాలకే పెద్ద పీట వేశారని ఇద్దరు బిసి డి లు కాగా, మరో ఇద్దరు బిసి బి లని ప్రస్తుతం జగిత్యాల కూడా బిసి డి సామజిక వర్గానికే కట్టబెడుతున్నారని ఒడ్డెర సామజిక వర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు.