భారత్ బంద్ సమ్మె విజయవంతం

భారత్ బంద్ సమ్మె విజయవంతం

ముద్ర/రాజాపేట:-బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం   గ్రామీణ భారత్ బంద్, సమ్మె రాజపేట మండలంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేశారు.రాజపేట వివేకానంద విగ్రహం నుండి బైక్ ర్యాలీ నిర్వహించి  ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మంగ నరసింహులు సిపిఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రేగు శ్రీశైలం, ఏఐటీసీ మండల కార్యదర్శి మూలపోషయ ,రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి పోశెట్టి మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం చేయాలని అన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను మంత్రివర్గం నుండి తొలగించి ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు పెన్షన్ 10000 రూపాయలు అందరికీ ఇవ్వాలని అన్నారు ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నష్టం చేసే విధానాలు తీసుకొస్తుందని అన్నారు ఉపాధి హామీ చట్టాన్ని విస్తరింపచేసి 200 రోజులకు పెంచాలని రోజుకు 800 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు దయ్యాల సిద్ధులు ఐఎఫ్టియు నాయకులు బుగ్గ నరసింహులు నాయకులు ఎమ్మే బాలరాజ్ కోయ బాబు సిఐటియు నాయకులు మహేష్ రాజ్యం సిద్ధి లింగం బాల్ది శ్రీశైలం జూకంటి చంద్రయ్య కాకర్ల మల్లేష్ పుప్పాల మల్లేష్ దోమల పాండు బచ్చలి నర్సింహులు ఎర్ర గోకుల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.