చిన్న మేడారంలో ఒక గద్దెపై ఆకులు ఎండిన చెట్టు...

చిన్న మేడారంలో ఒక గద్దెపై ఆకులు ఎండిన చెట్టు...
  • మరొ గద్దె పై పచ్చగా ఆకులతో చెట్టు...               
  • మిగతా వేప చెట్ల మాదిరిగానే ఆకులు ఎండిపోయాయన్న భక్తులు..

ముద్ర/రాజపేట:-  రాజపేట మండలం చిన్న మేడారం రెండు గద్దల పైన ఉన్న చెట్లలో ఒక చెట్టు ఆకులు ఎండిపోవడం మరో చెట్టు ఆకులు పచ్చగా ఉండడం పట్ల చర్చ మొదలైంది. ఈ విషయంపై పలువురు భక్తుల మాట్లాడుతూ అన్ని వేప చెట్ల మాదిరిగానే గద్దల పైన ఉన్న చెట్టు ఆకులు కూడా ఎండిపోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఆలేరు ఎక్సైజ్ సీఐ దీపిక మాట్లాడుతూ  శాంతి భద్రతల దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా జాతరలో ఎలాంటి మద్యం విక్రయించకూడదని అనుమతి లేదని,మద్యం విక్రయించిన వారిపై కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. మద్యం విక్రయించే వివరాలను ఆధారాలతో తమకు తెలియజేసి సహకరించాలని కోరారు. జాతర నిర్వాహకులలో ఒకరైన సంపత్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ చిన్న మేడారం జాతరను కలుపుకోవాలని సంబంధిత అధికారులను కోరుతూ,  ఈసారి జాతర ముగిసిన వెంటనే అందుకు సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని దేవాదాయ శాఖ అధికారులకు అందజేయనున్నట్లు చెప్పారు.