హిందుస్థాన్ శానిటరీవేర్ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవీ విజయం

హిందుస్థాన్ శానిటరీవేర్ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవీ విజయం
  • అధ్యక్షుడిగా ఎన్నికైన నరేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండలంలో పెద్ద పరిశ్రమ హిందూస్థాన్ శానిటరీవేర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎస్ఐఎల్) కార్మిక సంఘం ఎన్నికలలో టీఆర్ఎస్ కేవీ ఘనవిజయం సాధించింది. ఐఎన్ టీయూసీ అభ్యర్థి మహ్మద్ చాంద్ ఖాన్ పై టీఆర్ఎస్ కేవీ అభ్యర్థి గాదె నరేందర్ రెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఐఎన్ టీయూసీ అభ్యర్థి చాంద్ ఖాన్ కు 233 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ కేవీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 367 ఓట్లు పోలయ్యాయి. 134 ఓట్ల మెజారితో నరేందర్ రెడ్డి గెలుపొందినట్టు ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు. 

ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే టీఆర్ఎస్ కేవీ కి మద్దతిచ్చిన బీఎంఎస్ కార్మిక సంఘం కార్మికులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. విజేత నరేందర్ రెడ్డిని భుజాలకు ఎత్తుకుని హర్షం వ్యక్తం చేస్తూ, మిఠాయిలు పంచుకున్నారు. పరిశ్రమకు చేరువలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బాణసంచా కాల్చి విజేతను ఊరేగించారు. ఈ  కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ ప్రధాన కార్యదర్శి ఎస్.లింగం, సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీఎంఎస్ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి రమేష్, బసవరెడ్డి, ఐలయ్య, కాటమయ్య, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.