60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను  నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుంది

60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను  నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుంది
  • దశాబ్దం పాటు కార్యకర్తలు నాయకుల ఓపిక, సహనమే కాంగ్రెస్ గెలుపుకు నాంది
  • కాంగ్రెస్ ఓబీసీ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్
  • ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ఏఐసిసి అధ్యక్షురాలు  సిడబ్ల్యూసి సభ్యురాలు శ్రీమతి సోనియాగాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని తండు శ్రీనివాస్ యాదవ్ నివాసంలో  శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దం పాటు నాయకులు, కార్యకర్తల ఓపిక సహనము మొక్కవోని అకుంఠిత చైతన్యమే తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ఏర్పాటు నాంది పలికిందని తెలిపారు.అవినీతి అక్రమాల బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఓటు అనే వజ్రాయుధం తో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను హామీ మేరకే తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి ఎనుముల  రేవంత్ రెడ్డి చేశారని ఇచ్చిన హామీ కి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ కాలంలో నిధులు,  నీళ్లు, నియామకాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కృషి  చేసి ఐక్యమత్యంతో ప్రభుత్వానికి సహకరించి పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ భాగం రాష్ట్ర కోఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, జిల్లా ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ గుంటి సైదులు ముదిరాజ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు గంజికుంట్ల గోపీనాథ్,పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎస్, కె, సైదా ఖాసీం, గుంటూరి చిట్టిబాబు,ఎస్.కె రెహమాన్ భాయ్, సిద్ధిపరుశురాం యాదవ్, మామిడి నాగరాజు, సూర్యప్రకాష్, పోలెబోయిన లింగరాజు యాదవ్, గుద్దేటి శ్యామ్, జిల్లేపల్లి సైదాచారి, తదితరులు పాల్గొన్నారు.