ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

ముద్ర. వీపనగండ్ల:-ఏఐసీసీ అగ్ర నాయకురాలు తెలంగాణ తల్లి సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను శనివారం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేసి కేకులు కట్ చేసి స్వీట్స్ పచ్చి సంబరాలు చేశారు. ఆరు దశాబ్దాల ఆకాంక్ష, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సుందర స్వప్నం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తీర్చుకోవడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.

నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొరల తెలంగాణగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, నేడు వారి కబంధహస్తాల నుంచి విముక్తి కలిగించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య అన్నారు. కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఏత్తం కృష్ణయ్య,మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు విష్ణు,నాయకులు గోపి,వేంకట రెడ్డి, రాజశేఖర్,నరేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటయ్య,ఆదయ్య, రఘు,మహేశ్ తదితరులు ఉన్నారు.