గ్రామ పంచాయతీ కార్మికుల  సమస్యలను వెంటనే పరిష్కరించాలి  - సిఐటియు

గ్రామ పంచాయతీ కార్మికుల  సమస్యలను వెంటనే పరిష్కరించాలి  - సిఐటియు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత 27 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేయలని, వారి డిమాండ్లను ఆమోదించాలని సి ఐ టి యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. నిర్మల్ లో  మంగళవారం గ్రామ పంచాయితీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12769 గ్రామపంచాయతీల్లో 50వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. సమ్మెతో  గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారిందన్నారు.  పదకొండవ పీఆర్పీ  జీవో 60 ప్రకారం నెలకు రూ.16500 సిపాయిలకు, కారోబార్, బిల్ కలెక్టర్,ట్రాక్టర్ డ్రైవర్లకు, ఎలక్ట్రిషియన్లకు రూ.19500 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పని భద్రతను హరించే మల్టీపర్పస్ విధానాన్ని జీవో51ను సవరించాలన్నారు. కార్మికులందరికి ప్రమాద బీమా రూ.10 లక్షలు సాధారణ భీమా రూ.5లక్షలు  ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, చట్టాలను వర్తింపజేయాలని  కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, శ్రీనివాస, నాగరాజు, మహేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆకాష్,నగేష్ దేవరావు,లింగన్న, స్వామి గోవిందు, నాగేష్, కారోబార్ సంఘం అధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.