తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి

తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి
  • గిరిజన వర్సిటీ ఏర్పాటుపై హర్షం
  • మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ముద్ర ప్రతినిధి, జనగామ : తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జనగామ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆరుట్ల దశమంతరెడ్డి మాట్లాడుతూ.. ములుగులో రూ.900 కోట్లతో సమ్మక్క– సారలమ్మ పేరుతో గిరిజన కేంద్రియ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇదే కాదు తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. 

గాంధీకి ఘన నివాళి..

గాంధీ జయంతి పురస్కరించుకుని సిద్దిపేట రోడ్డులో ఉన్న మహాత్ముడి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉడుగుల రమేశ్, సౌడ రమేశ్, బేజాడి బీరప్ప, దేవరాయ ఎల్లయ్య, హరిశ్చంద్రగుప్తా, బొట్ల శ్రీనివాస్, గుజ్జుల సత్యనారాయణ, సంపత్‌కుమార్, వెంకట్‌రెడ్డి, హరిప్రసాద్, జగదీశ్, నవీన్ పాల్గొన్నారు.