బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది

బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది
  • భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్
  • బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అడ్‌హక్‌ కమిటీ ఎన్నిక

ముద్ర ప్రతినిధి, జనగామ: తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరిగిందని అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ పుల్లెల గోపీచంద్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పింగిల్ రమేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసోసియేషన్‌ మీటింగ్‌ ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక మంది క్రీడాకారులు బ్యాడ్మింటన్‌ శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని జనగామ జిల్లా క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు.

అనంతరం జనగామ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అడ్‌హక్‌ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోపగోని సుగుణాకర్, ప్రధాన కార్యదర్శిగా కైరిక హనుమంతరావు, కోశాధికారిగా మర్యాల రమేశ్‌బాబు, ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శిగా మైకేల్ కార్యవర్గ సభ్యులుగా తిప్పారపు శ్యాంసన్, కానుగంటి శేఖర్, కుర్నాల అనిల్ కుమార్, గజ్జల రాజును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ ట్రెజరర్ కె.పాణిరావు, వరంగల్ జిల్లా ట్రెజరర్ డి.కిషన్, సంయుక్త కార్యదర్శి కొమ్ము రాజేందర్, శ్రీనివాస్‌రెడ్డి, గంగిశెట్టి మనోజ్ కుమార్, అశోక్, రవి, వినోద్, మనోహర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.