సామాజిక తెలంగాణ వైపు కాంగ్రెస్ అడుగులు

సామాజిక తెలంగాణ వైపు కాంగ్రెస్ అడుగులు

పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ సాధన వైపు అడుగులు వేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో సోమవారం నాడు ఆయన 'ముద్ర ప్రతినిధి' తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాగా ఉద్యోగ నియామకాలు చేయకుండా ప్రభుత్వం పీఠముడులు వేస్తున్నందున మరోసారి పోరాటం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ముందు గానే కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించేందుకు వచ్చే ఎన్నికలను అస్త్రంగా వాడుకుంటుందని శ్రీకాంత్ గౌడ్ చెప్పారు.
బారాస ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబంలోని అందరికీ వివిధ రకాల ఉద్యోగాలు లభించాలని ఆరోపించారు.

 తెలంగాణ యువతకు మాత్రం మొండి చేయ మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల దళిత అట్టడుగు వర్గాల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి పదిలంగా ఉందని వచ్చే ఎన్నికల్లో వారంతా కాంగ్రెస్కు మద్దతిస్తారని శ్రీకాంత్ గౌడ్ భీమా వ్యక్తం చేశారు ఒకరోజు పర్యటన కోసం సిద్దిపేట జిల్లాకు వచ్చిన ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ను స్థానిక కాంగ్రెస్ నేతలు యువకులు గజమాలతో సత్కరించారు ఈ పర్యటనలో శ్రీకాంత్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఓబీసీ సెల్ సిద్దిపేట జిల్లా చైర్మన్ ఎల్ సూర్యచంద్ర వర్మ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ ఉన్నారు.