ఉచిత హెల్మెట్ల పంపిణి

ఉచిత హెల్మెట్ల పంపిణి
  •  యువతను మించిన సంపద లేదు
  • కే అర్ అర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి

దుబ్బాక,ముద్ర : సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరెపల్లి గ్రామములో మన కోసం కే అర్ అర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఉచిత హెల్మెట్ లు పంపిణి చేసారు . ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఈ మండల ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఫౌండేషన్ స్థాపించి ఎన్నో రోడ్డు ప్రమాదాలలో యువకులు, ప్రజలు మరణించడం నన్ను తీవ్రంగా కలచివేసిందని అప్పుడు దీనికి ముఖ్య కారణం హెల్మెట్ లు ధరించకపోవడం వల్ల చాల ప్రమాదాలలో యువత ,ప్రజలు మరనించడం జరుగుతుందని గ్రహించి ఈ ఉచిత హెల్మెట్ పంపిణి చేపడుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమం లో ఆరెపల్లి గ్రామ సర్పంచ్ శెట్టి జయలక్ష్మి -కృష్ణం రాజు ,ఎంపిటిసి ఎల్ .రాంరెడ్డి ,పోతారం సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి , గ్రామ యువకులు ,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .