కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారిని దూరంగా పెట్టాలి సిద్దిపేటలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారిని దూరంగా పెట్టాలి సిద్దిపేటలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట : ముద్ర  ప్రతినిధి : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద జరిగిన పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో  రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరిపారని తెలిపారు.సీఎం కేసీఆర్ 9 ఎండ్లలో పాలనలో అందరూ అన్నదమ్ముల వలె పండుగలు నిర్వహించుకుంటున్నారని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల్లో కుల, మతాలకు,అతీతంగా అభివృద్ధి పనులను ప్రభుత్వంచేపడుతున్నదని చెప్పారు. కొందరు కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బంగడుపుకునేవారు.రాష్ట్రంలో తిరుగుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వివిధ కమిటీల చైర్మన్లు, పట్టణ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో పాటు పలువురు మైనారిటీ నాయకులకు మంత్రి శుభాకాంక్షలు  తెలిపారు.

రంజాన్ పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణం ఎగ్బాల్ మీనార్ వద్ద  సిద్దిపేట పట్టణం లోని ఇతర మసీదుల వద్ద గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పట్టణాలలో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక్బాల్ మీనార్ వద్ద సిద్దిపేట డిసిపి మహేందర్ స్వయంగా స్వయంగా బందోబస్తు పర్యవేక్షణచేసి ప్రార్థనలు అయిపోయిన తర్వాత ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపి దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, ఇన్స్పెక్టర్లు బిక్షపతి, రవికుమార్, భాను ప్రకాష్, సిద్దిపేట రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ,  పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య ముస్లిం సోదరులు  నమాజ్ ప్రార్ధనలు చేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.