భువనగిరి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం..

భువనగిరి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం..
  • చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు..
  • వైస్ చైర్మన్ గా బిజెపి కౌన్సిలర్ మాయ దశరథ

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయ శ్రీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు.

ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లు ,ఎక్స్ అఫిషియో సభ్యడు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు ను కౌన్సిలర్  జిట్టా వేణు గోపాల్ రెడ్డి ప్రతిపాదించగా కాంగ్రెస్ కౌన్సిలర్ కైరకొండ వెంకటేష్ బలపర్చారు.

మొత్తం 17 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడు తో చేతులు ఎత్తి పోతంశెట్టి వెంకటేశ్వర్లును చైర్మన్ గా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక బిజెపి పార్టీ నుంచి మాయ దశరథ పోటీ లో ఉండగా వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉండడంతో బిజెపి కౌన్సిలర్ మాయ దాశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి అనునిత్యం అందరికీ అందుబాటులో ఉంటానని నూతనంగా ఎన్నికైన చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.