ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ వారం లోగా పూర్తి చేయాలి -  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ వారం లోగా పూర్తి చేయాలి -   జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ వారం లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ లోని డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్, మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన డేటా ఎంట్రీ పనితీరును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ దరఖాస్తు డేటా ఎంట్రీ సూక్ష్మంగా తప్పులు లేకుండా అప్ లోడ్ చేయాలని అన్నారు.

జిల్లాలోని 383 గ్రామ పంచాయతీలు, ఐదు మునిసిపల్ 134 వార్డులలో మొత్తం 3,24,532 అభయ హస్తం  దరఖాస్తులు వచ్చాయని, వాటన్నిటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు డేటా ఎంట్రీ చేయాలని అన్నారు. డేటా ఎంట్రీ కోసం 542 కంప్యూటర్ లు, ల్యాప్ టాప్ లను సమకూర్చడం జరిగిందని, రెండు షిప్ట్ ల వారీగా డేటా ఎంట్రీ కి ఆపరేటర్స్ లను నియమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహ మూర్తి, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, మునిసిపల్ ప్రత్యేక అధికారి నరేష్, మునిసిపల్ కమీషనర్ అనీల్ బాబు, జగిత్యాల పట్టణ తహశీల్దార్ వర్డానం, డివిజనల్ పంచాయతీ అధికారులు కనకదుర్గ, శంకర్, జగిత్యాల గ్రామీణ ఎంపిడిఒ రాజేశ్వరి, హౌసింగ్ డిఈ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.