నన్ను తప్పుగా అర్ధం చేసుకోవద్దు

నన్ను తప్పుగా అర్ధం చేసుకోవద్దు

నేను క్యాన్సర్‌ టెస్టులు మాత్రమే చేయించుకున్నాను.. క్యాన్సర్‌ బారిన పడలేదు అని మెగాస్టార్‌ చిరంజీవి స్పష్టం చేశారు. తాను ఓ కార్యక్రమంలో క్యాన్సర్ అవగాహన గురించి మాట్లాడుతూ... క్యాన్సర్ బారిన పడ్డానంటూ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన నేడు ట్వీట్ చేశారు. టెస్టుల్లో నాన్ క్యాన్సరస్ పాలిప్స్‌ను డాక్టర్లు గుర్తించి తీసేశారని మాత్రమే చెప్పానని చిరు వివరణ ఇచ్చారు.

https://twitter.com/KChiruTweets/status/1664988508883406848

“కాసేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవడం గురించి మాట్లాడాను. రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చని అన్నాను. నేను అలెర్టుగా ఉండి కొలోన్ స్కోప్ టెస్టు చేయించుకున్నా. అందులో భాగంగా నాన్ క్యాన్సరస్ పాలిప్స్‌ను గుర్తించి తీసేశారని చెప్పా. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను. చికిత్స వల్ల బయటపడ్డాన’ని రాశారు. దీని వల్ల కన్‍ఫ్యూజన్ ఏర్పడింది. అనేక మంది శ్రేయోభిలాషులు నాకు మెసేజ్‍లు పంపిస్తున్నారు. వారందరి కోసమే ఈ క్లారిఫికేషన్. విషయాన్ని అర్థం చేసుకోకుండా రాయడం వల్ల అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసిన వారవుతారు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని  ప్రారంభించిన  సందర్భంగా క్యాన్సర్ పట్ల  అవగాహన పెరగాల్సిన  అవసరం  గురించి  మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్  టెస్టులు   చేయించుకుంటే  క్యాన్సర్ రాకుండా  నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్… అంతకు ముందు ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. “కోలన్ క్యాన్సర్ అనేది కామన్‍గా వస్తుంది. దాన్ని ప్రాథమికంగా గుర్తించడం చాలా కష్టం. అందుకే గతంలో నేను ముందు జాగ్రత్తగా ఏఐజీ ఆసుపత్రిలో కొలనోస్కోపీ చేయించుకున్నా. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి.. నాకు కొలనోస్కోపీ చేశారు. అప్పుడు పాలిప్స్ ఉన్నాయని తేలింది. అలానే వదిలేస్తే మాలిగ్నేన్‍గా మారే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెప్పారు. 90 శాతం పాలిప్స్ మాలిగ్నేన్‍గా మారే ప్రమాదం ఉంది. మీరు చాలా త్వరగా వచ్చారని చెప్పి డాక్టర్ ఆ పాలిప్స్ తీసేశారు.” అని చిరంజీవి ఓ కార్యక్రమంలో అన్నారు. క్యాన్సర్‌పై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అపసరమైతే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు సమాజంలో కొందరు ముందుకు రావాలని చిరంజీవి పిలుపునిచ్చారు. అలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు తన వంతు సాయం అందిస్తానని అన్నారు.