అభివృధి పనులను ప్రారంభించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

అభివృధి పనులను ప్రారంభించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:ఎల్లారెడ్డి నియోజకవర్గం లో ఆదివారం సదాశివనగర్ మండలం మర్ఖల్ గ్రామంలో  కోటి రూపాయల నిధులతో సీసీ రోడ్డు & డ్రైనుల పనులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 120 కోట్ల నిధులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ అభవృద్ధికి కృషి జరుగుతుంది అని అన్నారు. ఎల్లారెడ్డి అభివృధి లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందని అన్నారు. త్వరలో 4 కోట్ల నిధులతో మరిన్ని అభివృధి పనులు ప్రారంభమవుతాయి అని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్యా వచ్చిన అతి తక్కువ సమయంలో పరిష్కారం చూపడం జరుగుతుంది ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, MYF సభ్యులు పాల్గొన్నారు.