ఎన్నికల్లో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ పనికిరాదు

ఎన్నికల్లో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ పనికిరాదు

కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర ,జమ్మికుంట: రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడిపోతే చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయటం నాయకుడి లక్షణం కాదని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్యలు అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని  తుమ్మేటి సమ్మిరెడ్డి నివాసములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం నాడు తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నాలుగో తారీఖున విజయ యాత్ర కు రావాలని, లేకుంటే తన కుటుంబ సభ్యుల శవయాత్రకు రావాలని ప్రసంగించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. 

గతంలో రౌడీ రాజకీయాలు చేసి, ఎన్నికల్లో ఎలాగైనా తాను ఓడిపోతానని  నిర్ణయానికి వచ్చి ఇలాంటి వాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఇలాంటి మాటలు మాట్లాడి సానుభూతి పొంది గెలుపొందాలని చూస్తే ప్రజలంతా అమాయకులు కాదని వారు చెప్పుకొచ్చారు. తన సహాయంతో తన అనుచరులు భూకబ్జాలకు పెట్రేగిపోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తిని చిత్తు, చిత్తుగా ఓడించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒడితల ప్రణవ బాబును గెలిపించినట్లయితే హుజురాబాద్ ప్రాంతం ప్రశాంత వాతావరణంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్, మహమ్మద్ సలీం, గడ్డం దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.