కొదురుపాకను మండలం చేస్తాను

కొదురుపాకను మండలం చేస్తాను

శివాలయంలో ఆరు గ్యారెంటీల బాండ్ పేపర్ కు పూజలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ఆరు గ్యారంటీలు అమలు 
స్థానికున్ని నాకు ఒక అవకాశం ఇవ్వండి
ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి చేసి చూపిస్తా
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి
ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం

ముద్ర, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్, కొదురుపాక, బోయినిపల్లి, కోరెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మేడిపల్లి సత్యంకి బొట్టు పెట్టి మంగళ హారతులతో స్వాగతం పలికారు.మేడిపల్లి సత్యంకు మద్దతుగా భారీగా ప్రజలు తరలివచ్చినారు.ప్రచారంలో భాగంగా విలాసాగర్ గ్రామంలోని శివాలయంలో చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆరు గ్యారెంటీల పథకాలతో కూడిన బాండ్ పేపర్ ను పూజలు చేయించారు.ఎన్నికల ప్రచారంలో బాగంగా విలాసాగర్ కు రాగ,కార్తీక పౌర్ణ పురస్కరించుకొని మేడిపల్లి సత్యం శివాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని,ఆరు గ్యారెంటీల బాండ్ పేపర్ కు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ: డిసెంబర్ 30వ తారీఖు నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగోట్ల ప్రజానీకానికి ఆరు గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టబోతుందని,ఈ ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని ప్రజలందరికీ తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు.1987లో కోదురుపాక మండలం కావాల్సి ఉండగా,ఇంతవరకు మండలం కాలేదు.తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాదాపు 150 మండలాలు ఏర్పాటు చేసినారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొదురుపాకను మండలం ఏర్పాటు చేస్తానని, దానితో పాటు జూనియర్ కాలేజ్,డిగ్రీ కాలేజ్,వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని అన్నారు.మండల కేంద్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒక్కసారి బొడిగ శోభను గెలిపించారు,మరొకసారి సుంకె రవిశంకర్ లను ఎమ్మెల్యేగా గెలిపించారు.

నేను స్థానికున్ని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి,చోప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి చేసి నిరూపించుకుంటానని అన్నారు.మిడ్ మానేరు (రాజరాజేశ్వర జలాశయం) సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు నేను సమస్యలను పరిష్కరిస్తానన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యలను తీరుస్తానని, గోపాలస్వామి సాక్షిగా,దైవ సాక్షిగా వీటిని అమలు చేస్తానని అన్నారు.నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని మిమ్ములను వేడుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగినిపల్లి వెంకట రామారావు, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్,తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల కనకయ్య,కట్ట లక్ష్మణ్,బోయిని ఎల్లేష్, రామిడి శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్రెడ్డి మహేశ్వర్ రెడ్డి,మండల నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.