ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం

ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం
  • ఫార్మా రద్దు చేసి రైతులకు భూములు తిరిగిస్తామని మాటమార్చారు
  • ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ముద్ర, ఇబ్రహీంపట్నం:- ఫార్మాసిటీ భూములతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ ని రద్దుచేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి ఆభూములను రైతులకు తిరిగిఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా ఫార్మాసిటీ ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించి అక్కడ శాటిలైట్ టౌన్షిప్ లను ఏర్పాటు చేస్తామని మాట మార్చారు. అక్కడ టౌన్షిప్ ల ఏర్పాటు అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుంటే ఇంకేంటని ప్రశ్నించారు. ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనే గతంలో కాంగ్రెస్ తీసుకు రావడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచం మెచ్చే గ్రీన్ ఫార్మాసిటీ ని, ఫార్మా యూనివర్సిటీ ని, టౌన్ షిప్ లను ఏర్పాటుచేస్తామంటే వ్యతిరేకించిన వారు వ్యాపారం  అధికారంలోకి వచ్చి అక్కడ టౌన్షిప్ ల ఏర్పాటు చేస్తామనడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదని అన్నారు. రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతులకు భూములు ఇచ్చేయలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.