మంథని మున్సిపల్ నూతన కమిషనర్ గా జి.మల్లికార్జున స్వామి

మంథని మున్సిపల్ నూతన కమిషనర్ గా జి.మల్లికార్జున స్వామి
  • నిన్న బాలకృష్ణ..!నేడు మల్లికార్జున స్వామి ...
  • ఒక్క రోజులోనే మారిన బదిలీ ఉత్తర్వులు


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి :మంథని మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా జి.మల్లికార్జున స్వామి ని  నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను మంథని మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ  మున్సిపల్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  అరవింద్ కుమార్  ఉత్తర్వులు జారీచేశారు.

 కాగా మంథని మున్సిపల్ నూతన కమిషనర్ గా నియమితులైన గుట్టల మల్లికార్జున స్వామి  గతంలో కూడా మంథని మున్సిపల్ కమిషనర్ గా పని చేయగా వైన్ షాపులను ట్రేడ్ లైసెన్స్ బకాయిల కోసం సీజ్ చేశారన్న ఆరోపణలపై అప్పుడు ప్రభుత్వం అతని పై చర్యలు తీసుకోగా,  గత 9 సంవత్సరాల కాలంగా జమ్మికుంట, నర్సంపేట, మంథని, కోస్గిలలో కమిషనర్ గా భాధ్యతలు నెరవేర్చగా కోస్గిలో పని చేస్తున్నప్పుడు ఉత్తమ కమీషనర్ గా జాతీయ అవార్డు తో పాటు రాష్టస్థ్రాయి లో పలుమార్లు అనేక అవార్డులు కూడా ఆయన అందుకున్నారు.ఎన్నికల అనంతరం మున్సిపల్ కమిషనర్ మార్పు మంథని లో చర్చినియంగా మారింది.