కరీంనగర్ లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం

కరీంనగర్ లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం
  • పాదయాత్ర, రాంనగర్ లో కార్నర్ మీటింగ్ 
  • జంపు జిలానిలపై స్పెషల్ ఫోకస్
  • కరీంనగర్ సీట్ గెలవడమే లక్ష్యంగా దిశా నిర్దేశం 

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు కరీంనగర్ రానున్నారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ విజయమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని బి ఆర్ ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు పరిధిలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ జంపు జిలానిలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు నగరంలో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.