పశుపతినాథ్​ ఆలయ హుండీ

పశుపతినాథ్​ ఆలయ హుండీ
  • ఆదాయం రూ. 23,76,400
  • తొలిసారి పెద్ద యెత్తున విదేశీ కరెన్సీత

భోపాల్​: మధ్యప్రదేశ్​లోని పశుపతినాథుని ఆలయ హుండీలో భారీగా విదేశీ కరెన్సీలు దర్శనమిచ్చారు. హుండీలు లెక్కించేందుకు ఆలయ పాలకవర్గం అధికారులు తెరిచారు. విరాళాలను లెక్కించేందుకు నిర్వాహకులకు రెండు రోజుల సమయం పట్టింది.  హుండీల్లోని డొనేషన్ మొత్తాన్ని మొదటి రోజు రూ.7 లక్షల 99 వేల 50, రెండో రోజు రూ.15 లక్షల 77 వేల 400 గా ఆదివారం ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.  ఇలా రెండు రోజుల్లో విరాళం హుండీ నుంచి మొత్తం రూ.23 లక్షల 76 వేల 400 లను మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేశారు. మధ్యప్రదేశ్​లోని పశుపతినాథ్​ ఆలయం మందసౌర్​లో ఉంది. ఇందులో ఎనిమిది ముఖాలతో పశుపతినాథ్​విగ్రహం ఉంది. ఇక్కడకు భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తుంటారు. కాగా ఇంతభారీ ఎత్తున హుండీలో విరాళాలు పడడం మాత్రం ఇదే మొదటిసారని నిర్వాహకులు పేర్కొన్నారు. విరాళాలలో విదేశీ కరెన్సీనే ఎక్కువగా ఉండడంతో కరెన్సీనంతా భారత రూపాయల్లోకి లెక్కించి బ్యాంకులో జమ చేశారు. మధ్యప్రదేశ్​లో భారీ వర్షాల నేపథ్యంలో ఓ నెలరోజులపాటు ఆలయానికి భక్తులు ఎక్కువగా రాలేదు. గత పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో భారీగానే భక్తులు వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీకృష్ణజన్మాష్టమి రోజు భారీ ఎత్తున విదేశీ భక్తులు వచ్చారన్నారు. వారే హుండీల్లో విదేశీ కరెన్సీ వేయడం కనిపించిందన్నారు. రూ. 1,000 ఫ్రెంచ్ నోటు, రూ. 20 చైనీస్ నోటు విదేశీ కరెన్సీ నోట్లతోపాటు డాలర్​ నోట్లు, 120 గ్రాముల బరువున్న వెండి వస్తువులు కూడా విరాళం పెట్టెలో ఉన్నాయన్నారు. కాగా పశుపతినాథ్​ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మధ్యప్రదేశ్​సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​ ఇటీవలే రూ. 10 కోట్లు మంజూరు కూడా చేశారు.