అక్రమ ఇసుక రవాణా

అక్రమ ఇసుక రవాణా
  • బెదిరింపులకు పాల్పడుతున్న ట్రాక్టర్ యజమాన్యులు
  • రెవిన్యూ అధికారులను బెదిరిస్తున్న ట్రాక్టర్ ఓనర్లు


గుండాల మార్చ్ 23 (ముద్ర న్యూస్): గుండాల మండలంలోని వస్తాకొండూర్ బండకొత్త పల్లి గ్రామాలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రివేళాల్లో అక్రమ ఇసుక రవాణా సక్రమ ఇసుక రవాణా అనే విధంగా గుండాల మండలంలో ప్రభుత్వ ఇసుక ను బిక్కేరు వాగు ద్వారా నిత్యం పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు రవాణా జరుగుతున్నాయని ఆరోపణతున్నాయి,అక్రమ రవాణా ఇసుక జరిగింది అని తెలుస్తుంది రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన జీరో దందా మాత్రం ఆగడం లేదు. అక్రమ ఇసుకరాయుళ్లకు హద్దు పద్దు లేకుండా పోతున్న వైనం అక్రమ ఇసుకను అడ్డుకుంటున్న అధికారులపై దాడులకైనా సిద్ధమంటున్న ట్రాక్టర్ యజమాని అక్రమ ఇసుకను అడ్డుకున్న రెవిన్యూ అధికారులను బెదిరిస్తున్న ట్రాక్టర్ యాజమాన్యం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమ ఇసుకకు పాల్పడే ప్రతి ట్రాక్టర్లను సీజ్ చేయాలని కోరుతున్న గ్రామ ప్రజలు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని తాగనీరు నీళ్లు లేక పశువులు చనిపోతున్నాయని బోరు బావులు పంట పొలాలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు రైతులు అక్రమ ఇసుక దందాను ఆపాలని అధికారులను కోరారు. వస్తాకొండూర్ లో అక్రమ ఇసుక దందాను ఆపొద్దు అంటూ అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేస్తున్న అధికార పార్టీ నాయకుడు.