ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా వెంకటేష్

ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా వెంకటేష్

ముద్ర.వీపనగండ్ల: ప్రపంచ క్షయ వ్యాధి  దినోత్సవం పురస్కరించుకొని వీపనగండ్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేష్ కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీనివాసులు ప్రశంసా పత్రం అందించి అభినందించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వెంకటేష్ ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలాల్లోని గ్రామాలలో టిబి వ్యాధిగ్రస్తులకు తేమడ పరీక్షలు నిర్వహిస్తూ టీబీ వ్యాధి నివారణ పై అవగాహన అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. 

ఇదేఆసుపత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్ కలమ్మకు ఉత్తమ సూపర్వైజర్ గా ప్రశంసా పత్రం పొందారు. కార్యక్రమంలో జిల్లా టిబి ప్రోగ్రాం వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ తదితరులు ఉన్నారు