Inter Practical ఫిబ్రవరిలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌?

Inter Practical ఫిబ్రవరిలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌?
The schedule of practical exams of inter students in AP will change. The education department is making arrangements to conduct the practical exams before the theory exams. According to the announced schedule, the inter-practical exams are to be conducted in two phases from April 15 to May 10.

ఏపీలో ఇంటర్‌ విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ మారనుంది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే మే వరకు ప్రాక్టికల్స్‌ ఉండటంతో ఎంసెట్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్చాలని కళశాలల యాజమాన్యాల నుంచి ఇంటర్‌ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో థియరీ ఎగ్జామ్స్‌కు ముందే ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ రానుంది.

కాగా ఏపీలో ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు డిసెంబరు 26న ప్రకటించిన సంగతి తెలిసందే. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.అదేవిధంగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్‌ 30 నుంచి మే 10 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ.. ఫిబ్రవరిలోనే ప్రాక్టీకల్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఫిబ్రవరి 22న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను, ఫిబ్రవరి 24న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను  నిర్వహించనున్నారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూలు:
? మార్చి 15 ` బుధవారం ` సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`1
? మార్చి 17 ` శుక్రవారం ` ఇంగ్లిష్‌ పేపర్‌`1
? మార్చి 20 ` సోమవారం ` మ్యాథ్స్‌ పేపర్‌`1ఎ, బోటనీ పేపర్‌`1, సివిక్స్‌`1.
? మార్చి 23 ` గురువారం ` మ్యాథ్స్‌`1బి, జువాలజీ పేపర్‌`1, హిస్టరీ పేపర్‌`1
? మార్చి 25 ` శనివారం ` ఫిజిక్స్‌ పేపర్‌`1, ఎకనావి?క్స్‌ పేపర్‌`1
? మార్చి 28 ` మంగళవారం ` కెవి?స్ట్రీ పేపర్‌`1, కామర్స్‌ పేపర్‌`1, సోషియాలజీ పేపర్‌`1, ఫైన్‌ ఆర్ట్స్‌డ మ్యూజిక్‌ పేపర్‌`1
? మార్చి 31 ` శుక్రవారం ` పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌`1, లాజిక్‌ పేపర్‌`1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌`1 (బైపీసీ విద్యార్థులకు).
? ఏప్రిల్‌ 3 ` సోమవారం ` మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`1, జియోగ్రఫీ పేపర్‌`1
ఇంటర్‌ సెకండియర్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూలు:
? మార్చి 16 ` గురువారం ` సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`2
? మార్చి 18 ` శనివారం ` ఇంగ్లిష్‌ పేపర్‌`2
? మార్చి 21 ` మంగళవారం ` మ్యాథ్స్‌ పేపర్‌`2ఎ, బోటనీ, సివిక్స్‌`2.
? మార్చి 24 ` శుక్రవారం ` మ్యాథ్స్‌ పేపర్‌`2బి, జువాలజీ పేపర్‌`2, హిస్టరీ పేపర్‌`2.
? మార్చి 27 ` సోమవారం ` ఫిజిక్స్‌ పేపర్‌`2, ఎకనామిక్స్‌ పేపర్‌`2.
? మార్చి 29 ` బుధవారం ` కెవి?స్ట్రీ పేపర్‌`2, కామర్స్‌ పేపర్‌`2, సోషియాలజీ పేపర్‌`2, ఫైన్‌ ఆర్ట్స్‌డ మ్యూజిక్‌ పేపర్‌`2
? ఏప్రిల్‌ 1 ` శనివారం ` పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌`2, లాజిక్‌ పేపర్‌`2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌`2 (బైపీసీ విద్యార్థులకు).
? ఏప్రిల్‌ 4 ` మంగళవారం ` మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`2, జియోగ్రఫీ పేపర్‌`2
ఇతర పరీక్షల తేదీలు ఇలా:
? ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష: 22.02.2023 (బుధవారం).
?  ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష: 24.02.2023 (శుక్రవారం).