నియంత పాలన అంతం కాబోతుంది

నియంత పాలన అంతం కాబోతుంది
  • జిల్లాలోని మూడు స్థానాలు కాంగ్రెస్‌ కైవసం
  • జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ :ఈ నెల 3న స్పష్టమైన మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో రాబోతోందని, తెలంగాణలో కేసీఆర్‌‌ నియంత పాలన అంతకానుందని జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఆశీర్వదించి  అమూల్యమైన ఓటు వేసిన ప్రజలకు, తన కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డబ్బు సంచులతో  వచ్చి జనగామలో గెలుద్దాం.. అనుకున్న పల్లా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామలో ఎప్పుడైనా ఎన్నికలు సామరస్యంగా జరిగేవని,  కానీ పల్లా నాన్ లోకల్ నుంచి రౌడీలను తీసుకువచ్చి గొడవలు సృష్టించాడని ఆరోపించారు.  

సమావేశంలో పీసీసీ మెంబర్ చెంచరపు శ్రీనివాస్ రెడ్డి, మద్దూరు జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు, సీనియర్ నాయకులు చరాబుడ్ల దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ మచ్చ వరలక్ష్మి , మాజీ జడ్పీటీసీ దాసరి కళావతి, పీఏసీఎస్‌ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి , జిల్లా మాజీ అధికార ప్రతినిధి మేడ శ్రీనివాస్, జనగామ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అన్వర్, జనగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేష్, యూత్ కాంగ్రెస్  జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాష్, మునిగే కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.