జనరల్ అబ్జర్వర్ చే 17A,PO డైరీ,స్కూటీని కార్యక్రమం విజయవంతం

జనరల్ అబ్జర్వర్ చే 17A,PO డైరీ,స్కూటీని కార్యక్రమం విజయవంతం
  • ఆర్ ఓ కె .వీరబ్రహ్మచారి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జనరల్ అబ్జర్వర్ చే 17ఏ స్కూటీని కార్యక్రమం పి. ఓ. డైరీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినట్లు సూర్యాపేటఎన్నికల రిటర్నింగ్ అధికారి బ్రహ్మచారి తెలిపారు. శుక్రవారం  అగ్రికల్చర్ మార్కెట్ నందు పోటీలో పాల్గొన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అనంతరం ప్రిసైడింగ్ అధికారులు సమర్పించే పిఓ డైరీ ,17 ఏ రిజిస్టర్ , విసిట్ షీట్, బ్లైండ్ ఇన్ ఇన్ఫర్మేషన్ పారాలను జనరల్ అబ్జర్వర్ బాలకృషున్ ముండా  క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లు  తెలిపారు.271పోలింగ్ కేంద్రాలలో15% పైబడిన పోలింగ్ కేంద్రాల రిజిస్టర్లు, 15% తక్కువ పోలైన పోలింగ్ కేంద్రాల రికార్డులను వారు పరిశీలించారు.

సూర్యాపేట నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన పోలింగ్ స్టేషన్  204 అక్కల దేవి గూడెంలో 96.42% అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైన  పోలింగ్ స్టేషన్ 99 సాయి త్రివేణి కాలేజీ సూర్యాపేట నందు 33.07% అభ్యర్థులు ఏజెంట్ల కోరిక మేరకు పోలింగ్ స్టేషన్ లు 86, 129 పోలింగ్ కేంద్రాలలో సైతం స్కూటీని చేశారు. ప్రిసైడింగ్ అధికారుల సమర్పించిన  పోలింగ్ ఏజెంట్లు నమోదు చేసుకున్న వివరాల ప్రకారం సక్రమంగా ఉండడం వలన జనరల్  పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దారులు శ్యాంసుందర్ రెడ్డి, రంగారావు కృష్ణయ్య, మహేందర్ రెడ్డి వెంకటేశ్వర్లు అభ్యర్థులు  ఏజెంట్లు పాల్గొన్నారు.