జవాన్ కు ఆరుగురు యాక్షన్​ డైరెక్టర్లు

జవాన్ కు ఆరుగురు యాక్షన్​ డైరెక్టర్లు


కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ మూవీ 'జవాన్'. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి  యాక్షన్ కొరియోగ్రాఫర్స్ 'జవాన్' సినిమాకు ఫైట్స్ డిజైన్ చేయటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పైన పేర్కొన్న యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ప్రపంచంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు వర్క్ చేశారు. జవాన్ లో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇవన్నీ కథలో భాగంగా ఉంటూనే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనున్నాయి. సాధారణంగా ఒకరు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తేనే ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది ఏకంగా 6గురు అత్యుత్తమ యాక్షన్ మాస్టర్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఇంటర్నేషనల్ యాక్షన్ వరల్డ్ లో స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి వారికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందువల్లనే జవాన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుపరుస్తున్నాయి.