షూటింగ్‌లో గాయపడిన సమంత

షూటింగ్‌లో గాయపడిన సమంత

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత  గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు సైతం చేస్తోంది. అందులో ‘సిటాడెల్’  అనే వెబ్‌సిరీస్‌లో కూడా ఉంది.  ఆ హిందీ వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ , సమంత కలిసి నటిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయం రాజ్, డికే  ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత పలు యాక్షన్ సన్నీవేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా ట్రెనింగ్ కూడా తీసుకుంది. అనంతరం షూటింగ్‌లో పాల్గొన్న సామ్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ.. సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది. అందులో రెండు చేతులకి గాయాలున్నాయి. దానికి.. ‘యాక్షన్ ఫలితం’ అంటూ కామెంట్ కూడా రాసుకొచ్చింది.