కాంగ్రెసుకు అనుకూలంగా కర్నాటక ఎగ్జిట్​ పోల్స్​

కాంగ్రెసుకు అనుకూలంగా కర్నాటక ఎగ్జిట్​ పోల్స్​

కర్నాటక ఎగ్జిట్​ పోల్స్​ మొదలయ్యాయి. సర్వేలన్నీ కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్నాయి.  భారత్​ వర్ష్–పోల్​స్టార్ట్​ సర్వే ​ తన ఎగ్జిట్​ పోల్స్​లో బీజేపీకి 88–98 స్థానాలు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్​కు 99–109, జేడీఎస్​కు 21–26  వస్తాయని చెప్పింది. ఇతరులకు నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై తొలి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చేసింది. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టదని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 107–119 వరకు సీట్లు రావచ్చని అంచనా వేస్తోంది. ఇక బీజేపీకి 70–90 స్థానాలు రావచ్చని అంచనా వేస్తోంది. జేడీఎస్ కు  23–-29 సీట్లు రావచ్చని పేర్కొంది. జీ న్యూస్ కూడా కాంగ్రెస్​కే అధికారం కట్టబెట్టింది. ఆ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని జీ న్యూస్ అంచనా వేసింది. కాంగ్రెస్ 110–103, బీజేపీ 79-–94, జేడీఎస్ 25–-33, ఇతరులు 2-5 సీట్లు సాధిస్తారని పేర్కొంది.

సీ ఓటర్లోనూ బీజేపీకి వ్యతిరేక ఫలితం వచ్చింది.  కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్​కు  అనుకూలంగా వస్తున్నాయి. TV9– కన్నడ–సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో బీజేపీకి 83-95 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు 100-112 సీట్లు వస్తాయంది. దీంతో హస్తం పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇక JDS కు 21-29 సీట్లు, ఇతరులకు 2-6 వస్తాయంది.  కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టే అవకాశం లేదని రిపబ్లిక్ టీవీ సర్వే పేర్కొంది. ఈసారి కాషాయ పార్టీ 85–100 స్థానాలు పొందవచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్​కు  94–108, జేడీఎస్​కు  24-32 సీట్లు రావచ్చని రిపబ్లిక్ టీవీ చెబుతోంది.