సిమెంట్ లైనింగ్ తో చివరి ఆయకట్టు భూములకు నీళ్లు

సిమెంట్ లైనింగ్ తో చివరి ఆయకట్టు భూములకు నీళ్లు
  • మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి యం. పద్మా దేవేందర్ రెడ్డి హవేలి ఘనపూర్ మండలంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఉదయం తొగిట నుండి మద్దుల్వాయి, ముత్తాయికోట, కూచన్ పల్లి, ముత్తాయిపల్లి, ఫరీద్ పూర్, వాడి, రాజపేట్, కొత్తపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.

బిఆర్ఎస్ తోనే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునిగినట్లవుతుందని, బి ఆర్ఎస్ కి ఓటేస్తే  అభివృద్ధి బాటలో నడుస్తామని  పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు .    కాంగ్రెస్ పార్టీ  మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు చేపట్టడం జరిగిందన్నారు. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు పెళ్లిళ్లకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్నారన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.నిజాం హయాంలో తవ్విన మహబూబ్ నహర్ కాలువ సిమెంట్ లైనింగ్ చేయడం వల్ల చివరి ఆయకట్టుకు సాగు నీరు అందుతుందన్నారు. ఎండాకాలంలో సైతం నీరు పారిచ్చిన ఘనత కెసిఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కిందన్నారు.