ప్రోటోకాల్ రగడ -ఫ్లెక్సీ లో కనిపించని ఎమ్మెల్యే ఫోటో 

 ప్రోటోకాల్ రగడ -ఫ్లెక్సీ లో కనిపించని ఎమ్మెల్యే ఫోటో 

ముద్ర,రాయికల్ :- రాయికల్ పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం నందు నిర్వహించిన కళ్యాణ్ లక్ష్మీ మరియు సాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీలో జగిత్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో లేనందున తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ నాయకులు జోగినిపల్లి తిరుపతి గౌడ్ నిరసన వ్యక్తం చేయడంతో అధికారులపై రాయికల్ వైస్ ఛైర్మెన్ గండ్ర రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఫోటోను ప్రతి ఫ్లెక్సీ మీద ఉంచామని, ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే నీ అవమానించేలాగా ఫోటో పెట్టకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సరికాదని సంబంధిత శాఖ అధికారులు ఇకనైనా తీరు మార్చుకోని ఎమ్మెల్యే కు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని లేనియెడల ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.  గతంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  ఓ అధికారిని కక్షపూరితం గా బదిలీ చేయడం సరికాదని పురపాలక ఛైర్మెన్ మోర హన్మండ్లు అన్నారు.