ఎల్ ఆర్ ఎస్ ఫీజు వసూల్ నిర్ణయం వెనక తీసుకోవాలని కలెక్టరేట్లో ఎమ్మెల్యే ఆందోళన 

ఎల్ ఆర్ ఎస్ ఫీజు వసూల్ నిర్ణయం వెనక తీసుకోవాలని కలెక్టరేట్లో ఎమ్మెల్యే ఆందోళన 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం  తీసుకున్న ఎల్ ఆర్ ఎస్ ఫీజు నిర్ణయానికి వ్యతిరేకంగా జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాను కలిసి  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 10వేలకు  పైగా ధరకాస్తులు ఎల్ ఆర్ ఎస్ క్రమబద్దీకరణ కొరకు పెండింగ్ లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఫీజు లేకుండా ఉచితంగా అమలు చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని ,జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, జడ్పీ టీ సీ అశ్విని జాదవ్, వైస్ చైర్మన్ లు గోలి శ్రీనివాస్,గండ్ర రమాదేవి,పట్టణ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ ,పార్టీ నాయకులు,కౌన్సిలర్ లు,ప్రజా ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.