రేపే ముత్తారం సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి పై అవిశ్వాసం

రేపే ముత్తారం సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి పై అవిశ్వాసం
  • అవిశ్వాసానికి అనుకూలంగా 10 మంది డైరెక్టర్లు...
  • అవిశ్వాసం పై ముత్తారంలో కొనసాగుతున్న ఉత్కంఠ

ముత్తారం ముద్ర:-ముత్తారం సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి పై రేపు అవిశ్వాస కొనసాగనుంది. గత పది సంవత్సరాలుగా సింగిల్ విండో చైర్మన్ గా మండలంలో నియంతల కొనసాగుతున్న రాజిరెడ్డిపై ఏకంగా తన సింగిల్ విండో డైరెక్టర్లే ఆయనపై ఆగ్రహంతో అవిశ్వాసం పెట్టేందుకు పూనుకున్నారు. దీంతో గత 20 రోజులు క్రితం జిల్లా కలెక్టర్ కు సింగిల్ విండో అధికారికి చైర్మన్ రాజిరెడ్డి పై అవిశ్వాసం పెడుతున్నామని తీర్మానాన్ని డైరెక్టర్లు 13 మందిలో 9 మంది తీర్మానాన్ని అందజేయగా ఈ నెల 23 వ తేదీన అవిశ్వాసం పై అధికారులు తేదీని ప్రకటించారు.

దీంతో రేపు శుక్రవారం మండల కేంద్రాల్లోని సింగిల్ విండో కార్యాలయంలో సింగల్ విండో డైరెక్టర్ల సమక్షంలో అధికారులు అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో చైర్మన్ రాజిరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే 10 మంది సింగిల్ విండో డైరెక్టర్లు సంతకాలు చేయగా అవిశ్వాసం పై మండలంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఏకధాటిగా మండలంలో 10 సంవత్సరాలకు పైగానే సింగిల్ విండో చైర్మన్ గా కొనసాగుతున్న రాజిరెడ్డి ఇటు డైరెక్టర్లను అటు మండల రైతులను తన స్వార్ధం కోసం వాడుకుంటూ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలలో పని చేసుకుంటూ తనకు పాలసీలు చేయాలని వేధించేవాడని, ఆ పాలసీల కమిషన్ తో దాదాపు నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదిస్తున్నాడని మండలంలోని రైతులు, తన డైరెక్టర్లు తెలుపుతున్నారు.

సింగిల్ విండోలో కూడా రాజిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడో అని రైతులు చర్చించుకుంటున్నారు. రాజిరెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ఏకంగా డైరెక్టర్ మద్దెల లక్ష్మి భర్త, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య ప్రజావాణిలో కలెక్టర్ కు అ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాజిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో అతను చేసిన అవినీతి పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.