తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా  రేటినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కానుందా ?

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా  రేటినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కానుందా ?
  • పార్లమెంట్  ఎన్నికల కోడ్  వచ్చేసరికి మార్కెట్ చైర్మన్ నియామకం జరగనుందా?
  • మార్కెట్ చైర్మన్ నియామకంలోమాజీ మంత్రి మాటే చెల్లనుందా?


తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులలో ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ల నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇప్పటివరకు తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కనుసన్న లోనే మార్కెట్ చైర్మన్ ల నియామకం దేవాలయ కమిటీల నియామకం జరిగింది. కాగా సూర్యాపేట శాసనసభ్యులుగా దామోదర్ రెడ్డి కొనసాగిన నాడు సైతం తుంగతుర్తి రాజకీయాలను శాసించిన వ్యక్తిగా దామోదర్ రెడ్డికి పేరు ఉంది .నాడు సైతం తుంగతుర్తి నియోజకవర్గ మార్కెట్ చైర్మన్ దేవాలయ కమిటీ చైర్మన్ నియామకం మాజీ మంత్రి కను సన్నలలోనే  సాగింది .ప్రస్తుత తరుణంలో తుంగతుర్తి తిరుమలగిరి గౌరారం మోత్కూరు వ్యవసాయ మార్కెట్ల చైర్మన్ ల నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు ఇందుకుగాను మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన తనతోపాటు వెన్నంటి ఉన్న వారి పేర్లను సూచించే అవకాశం ఉందని విశ్వసినీయంగా తెలుస్తుంది .అందులో భాగంగా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన రేటినేని శ్రీనివాసరావు పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది .

ఈ విషయంపై అంతగా క్లారిటీ లేకున్నా చైర్మన్ నియామకం జరిగితే మా త్రం మొట్టమొదటి అవకాశం  రేట్నేని శ్రీనివాస్ కే రావచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తుంగతుర్తి శాసనసభ్యునిగా మందుల సామెల్ గెలిచిన అనంతరం నామినేటెడ్ పోస్టులలో గతంలో సామేలు వెంట ఉన్న వారికి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం ఉందని బహిరంగంగానే అనుకోవడం గమనార్హం .అందులో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఓరుగంటి సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినవచ్చింది . కాగా అనాదిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా దామోదర్ రెడ్డి సూచించే వ్యక్తికే మార్కెట్ చైర్మన్ దక్కే అవకాశం ఉందని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు .

తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో తనదైన శైలిలో రాజకీయం నడిపే అనుభవశాలి దామోదర్ రెడ్డి కావడం అంతేగాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసిన దామోదర్ రెడ్డి మాట కాదని కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి పనిచేసిన వారిని కాదని ఇప్పుడిప్పుడే వచ్చిన వారికి పదవులు లభించకపోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రావు కు దక్కనుంది అనే మాట వినవస్తోంది. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల కోడ్ సమీపిస్తున్న వేళ మార్కెట్ చైర్మన్ ల నియామకం పూర్తవుతుందనే మాట సర్వత్రావిన వస్తుంది. మరి మార్కెట్ చైర్మన్ నియామకంలో దామోదర్ రెడ్డిదే  నిర్ణయం అవుతుందనే మాట ఎంతవరకు నిజమవుతుందో అధికారికంగా పేరు వెలువడిన తర్వాత తెలుస్తుంది. అప్పటిదాకా వస్తున్న పేర్లు వాస్తవమా  ?కాదా ? నియోజకవర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది !