3 నెలల్లో 90,000  కు  పైగా స్టూడెంట్ వీసాలు 

3 నెలల్లో 90,000  కు  పైగా స్టూడెంట్ వీసాలు 
  • భార‌త్‌లో అమెరిక‌న్ ఎంబ‌సీ స‌రికొత్త రికార్డు 

న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ నుంచి ఆగ‌స్ట్ మ‌ధ్య‌న కేవలం మూడునెల‌ల్లో రికార్డు స్ధాయిలో 90,000 స్టూడెంట్ వీసాలు జారీ చేశామ‌ని భార‌త్‌లో అమెరికా రాయ‌బార కార్యాల‌యం  సోమ‌వారం ప్రకటించింది. జూన్‌, జులై, ఆగ‌స్ట్ మాసాల్లో 90000 పైగా స్టూడెంట్ వీసాలు మంజూరు చేశామ‌ని, ఇదే స‌మ‌యంలో ప్రపంచ వ్యాప్తంగా జారీ చేసిన ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాల్లో భార‌త్ నుంచి ఒక వీసా ఉంద‌ని పేర్కొంది.  అమెరికాను త‌మ ఉన్నత విద్య కోసం ఎంపిక చేసుకున్న విద్యార్ధులంద‌రికీ శుభాకాంక్షలని  భార‌త్‌లో అమెరిక‌న్ ఎంబ‌సీ ట్విట్టర్​ఖాతా పోస్ట్ చేసింది. టీమ్ వ‌ర్క్‌, ఇన్నోవేష‌న్‌తో అర్హులైన అభ్యర్ధులంద‌రూ త‌మ ప్రోగ్రామ్‌ల‌ను స‌కాలంలో చేప‌ట్టేలా తాము క‌స‌ర‌త్తు పూర్తిచేశామ‌ని ట్విట్టర్​పోస్ట్‌లో పేర్కొంది.