Shamshabad Airport - శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

Shamshabad Airport -  శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

ముద్ర,తెలంగాణ: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రెండురోజులుగా శ్రమిస్తున్నారు. 9 ట్రాప్ కెమెరాలు, ఒక బోన్ ఏర్పాటు చేశారు. బోన్ లో మేకను ఉంచి పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్లాన్ వేశారు. మరి ప్లాన్ వలలో చిరుత చిక్కుకుంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్న ఫెన్సింగ్ దూకుతుండటం కెమెరాలో రికార్డు అయ్యింది కానీ.. ఆ తరువాత చిరుత ఎక్కడికి వెళ్లింది, దాని ఆనవాలు అయితే కనిపించలేదు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు కంటిమీద కునుకులేకుండా శ్రమిస్తున్నారు.