నీతి ఆయోగ్ తో అభివృద్దికి బాటలు: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

నీతి ఆయోగ్ తో అభివృద్దికి బాటలు: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: నీతి ఆయోగ్ సంస్థతో వెనకబడిన జిల్లాల్లో అభివృద్ధికి బాటలు పడుతున్నాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో బుధవారం నిర్వహించిన బ్లాక్ లెవెల్ ట్రేనింగ్ ప్రోగ్రాంలో కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొని మాట్లాడారు. పురోగతి సాధించేందుకు చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా నీతి ఆయోగ్ సంస్థ ద్వారా విద్యా, వైద్య, రంగంలో జయశంకర్ జిల్లా ఎంతో పురోగతి సాధించిందని కలెక్టర్ చెప్పారు. వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి ఇప్పుడు చింతన్ శివీర్ కార్యక్రమం దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లాలోని మారుమూల మండలాలు అయిన మహాముత్తారం, పలిమెల మండలాలను ఎంపిక చేయడం చేయడం జరిగిందని, వాటి అభివృద్ధి కోసం మండలానికి పది మంది అధికారులను హైదరాబాద్ కు ట్రైనింగ్ కు పంపడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 39 ఎండికేటర్స్ ఉంటాయని అందులో ఉమెన్ అండ్ చైల్డ్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్ సహా మొత్తం 39 ఎండికేటర్స్ లలో వందకు వందశాతం నెరవేర్చేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. రెండు మండలాలకు గాను 5 సెక్టార్ లకు 5 టీమ్ లను ఎంపిక చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని రెండు మండలాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులకు సహకరించి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆయా గ్రామాలలో ఈ 39 అంశాలలో ఏ గ్రామం వెనకబడి ఉన్నది, ఆ గ్రామాలను గుర్తించి తక్షణమే గ్రామాలకు కావలసిన మౌళిక వసతుల కల్పన కు కృషి చేసి అభివృద్ధిలో పురోగతి సాధించి, నీతి ఆయోగ్ ద్వారా జయశంకర్ జిల్లాకు అదనంగా నిధులు వచ్చేలా పాటు పడాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సంస్థ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, సిపిఓ శామ్యూల్, జడ్పీ సిఈఓ విజయలక్ష్మి , డిపిఓ ఆశాలత, డిఎంహెచ్ఓ శ్రీరామ్, డిఆర్ డిఓ పురుషోత్తం, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ నిర్మల, ఎంపిడిఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.