స్పా ముసుగులో వ్యభిచారం.. నెల్లూరులో 14 మంది అరెస్టు

స్పా ముసుగులో వ్యభిచారం.. నెల్లూరులో 14 మంది అరెస్టు

నెల్లూరు నగరంలో స్పా సెంటర్ల పై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పా ముసుగులో పలువురు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లపై దాడులు కొనసాగుతున్నాయి.