సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి.

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి.

కూకట్ పల్లి, ముద్ర ::  ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, పలు అభివృద్ధి పనులను చేపట్టాలని 
ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే  గాంధీ  మాట్లాడుతూ  ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు
 కాలనీల లో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ లోని అన్ని కాలనీల లో పర్యటిస్తానని, నా దృష్టికి గాని , కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకువచ్చిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తానని ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు. అదేవిధంగా కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తానని ఎమ్మెల్యే  గాంధీ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి  శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు