ముందే ఓటమిని అంగీకరించిన రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ముందే ఓటమిని అంగీకరించిన రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భువనగిరిలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన మాటలు వింటే ఆయన ముందే ఓటమి ని అంగీకరించిన్నట్లు స్పష్టమవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమిచేయలేక ప్రజలకు చెప్పడానికి ఏమి లేక కొత్తగా మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఫ్రస్టేషన్లో కేసీఆర్ ను తిట్టి బతుకుతుండు అని ఆరోపించారు. సంస్కారహీనమైన భాష మాట్లాడుతూ రోత మాటలు తప్ప ప్రజలుకు అవసరమైన ఏ ఒకటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి120 రోజులు అవుతున్నా పరిపాలన ఎక్కడ ఉంది..? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండా అసలు అని ప్రశ్నించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరిలో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపును ఎవరు ఆపలేరన్నారు. జనగాం ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ఓటు బ్యాంకు బలంగా ఉందని మల్లేష్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గదారి కిషోర్, చిరుమర్తి లింగయ్య, ఉమా మాధవరెడ్డి, బూడిద బిక్షమయ్య, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత రాజకీయాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా గాని సంబంధాలు లేని అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.