ఆలేరు బిజెపి అభ్యర్థిగా పడాల ఎంపిక.....

ఆలేరు బిజెపి అభ్యర్థిగా పడాల ఎంపిక.....

ఆలేరు (ముద్ర న్యూస్):ఆలేరు శాసనసభ స్థానానికి బిజెపి పార్టీ అభ్యర్థిగా ఆలేరు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ప్రముఖ విద్యావేత్త పడాల శ్రీనివాస్ ను బిజెపి అధిష్టానం గురువారం నాడు ప్రకటించింది. శ్రీనివాస్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుండి బిఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ రెండు పర్యాయాలు ప్రస్తుత బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విజయంలో కీలకపాత్ర పోషించారు. తన సొంత మండలం అయిన తుర్కపల్లి మండలంలో ఆయనకు ప్రజాబలం పెద్ద ఎత్తున ఉంది. నవంబర్ 30న జరిగే ఎన్నికలలో ఆయన భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు.