ఘనంగా వడ్డే రాజుల ఎల్లమ్మ పండుగ

ఘనంగా వడ్డే రాజుల ఎల్లమ్మ పండుగ
  • బాలెం లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
  • తండోప తండాలుగా తరలివచ్చిన భక్తులు

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్ర పరిధిలోని బాలేంల గ్రామంలో మంగళ వారం వడ్డే రాజుల శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం  పండుగ ను శివరాత్రి శేఖర్ సహకారం తో ఘనంగా నిర్వహించారు.  వడియ రాజుల మహోత్సవం సందర్బంగా శ్రీ. రేణుక ఎల్లమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు వెదురు బొంగు బట్టలతో ఎల్లమ్మ తల్లి బాందివాల తో ఊరేగింపు నిర్వహించారు.పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పునకాలతో ఊగుతూ నృత్యాలు చేసి ఆడి పాడారు.

ఈ సందర్భముగా శివరాత్రి శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వడియ రాజుల మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మేకలు,గొర్రె పొతులను ఊరేగించి మరుసటి అమ్మవారికి బలి ఇచ్చి జాతర పరిసమాప్తి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమము లో శివరాత్రి కుటుంబ సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.