నీలి విప్లవం తో ఎగుమతి స్థాయికి చేరుకున్నాం

నీలి విప్లవం తో ఎగుమతి స్థాయికి చేరుకున్నాం
  • తెలంగాణలో కులవృత్తులకు న్యాయం జరిగింది
  • 12కోట్ల 35 లక్షల చేప పిల్లలను విడుదల చేశాం
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :నీలి విప్లవంతో దిగుమతి స్థాయి నుండి ఎగుమతి స్థాయికి చేరుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.శనివారం ఎల్ ఎం డి జలాశయంలోని గంగమ్మ దేవాలయం వద్ద మత్స్య శాఖ ఆధ్వర్యంలో 100% ఉచితంగా చేప పిల్లలను నగర మేయర్ వై సునీల్ రావు, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు అధికారంతో కలిసి విడుదల చేశారు.  అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించినారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుత సమైక్య పాలనలో కుల వృత్తులు ధ్వంసమయ్యాయని, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి ఆధునిక టెక్నాలజీతో విశ్వబ్రాహ్మణుల పొట్ట కొట్టారన్నారు.కులవృత్తులను కాపాడేందుకు సియం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు, యాదవులకు గొర్రెలు, ముదిరాజ్ లకు ఉచితంగా చేపల పంపిణీ, రూ.5 లక్షల బీమా  చేయడం జరుగుతుందన్నారు.  సమైక్య పాలనలో జలాశయాల్లో నీరు లేక నెర్రలువాసిన రోజులుండేవని  మత్స్య సంపద లేక ముదిరాజులు కూడా కులవృత్తికి దూరమైన పరిస్థితులు ఉండే్వని, కులవృత్తులను కాపాడుకోవాలని సియం కెసిఆర్ నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు, గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెలు, ముదిరాజులకు వంద శాతం సబ్సిడీతో చెపల పంపిణీ చేస్తున్నారన్నారు.నీలి విప్లవం తీసుకువచ్చి ముదిరాజ్ ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు.
2014 నుండి 2023 వరకు కరీంనగర్ జిల్లాలోని చెరువులు, కుంటలు,జలాశయాల్లో 10 కోట్ల 45 లక్షల విలువ చేసే 12 కోట్ల 35 లక్షల చేప పిల్లలు విడుదల చేశామని,9 సంవత్సరాల కాలంలో 29627.52 లక్షల విలువ చేసే 49 వేల 379 టన్నుల దిగుబడి వచ్చిందన్నారు.
లోయర్ మానేరు జలాశయంలో ప్రతి సంవత్సరం 30 లక్షల చేప పిల్లలు విడుదల చేస్తామని,ఇప్పటి వరకు 3 కోట్ల 43 లక్షల విలువ చేసే కోటి 55 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేస్తే 4676 లక్షల విలువ చేసే 7793 టన్నుల దిగుబడి వచ్చిందన్నారు.చేపల దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు.దురదృష్టవశాత్తూ మరణించిన మత్స్య కారుల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద భీమా... అంగవైకల్యం చెందిన వారికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నామని అన్నారు.సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ నుంచి వలసలు ఇతర ప్రాంతాలకు తగ్గి,ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు పెరిగాయని తెలిపారు.ఈ మత్స్య సంపదను సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్  వై.సునీల్ .రావు, జెడ్పి చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ బి. గోపి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గోన్నారు.