తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్

తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట సిద్దిపేట జిల్లా తైక్వాండ అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ జరిగింది. ఆదివారం రోజున సిద్దిపేట ఐఎంఏ హాల్లో జరిగిన ఈ ప్రమోషన్ టెస్టుకు ముఖ్యఅతిథిగా తైక్వాండో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పి రామ్మోహన్, చీఫ్ ఎగ్జామినర్ గా రాష్ట్ర తైక్వాండో ప్రతినిధి డి ధనుష్ వ్యవహరించారు గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బెల్టు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ పి రామ్మోహన్ మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం వలన క్రమశిక్షణ, ఆత్మ రక్షణ మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు.

అలాగే మంచి ఆరోగ్యంతో పాటు జాతీయస్థాయి , రాష్ట్ర స్థాయిలో రాణించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ వర్తిస్తుందని అన్నారు. ఈ పోటీలో 23 మంది విద్యార్థులు ఎల్లో బెల్ట్, 15 మంది విద్యార్థులు గ్రీన్ బెల్ట్, 13 మంది విద్యార్థులు బ్లూ బెల్ట్, 10 మంది విద్యార్థులు రెడ్1 బెల్ట్ సాధించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్, కోచ్ లు శివరాజ్, వరుణ్ రాజ్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.