దుబ్బాక నియోజకవర్గ యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళ

దుబ్బాక నియోజకవర్గ యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళ

 మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి

దుబ్బాక, ముద్ర: 18 సంవత్సరాల వయస్సు నిండి డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి యువతి,యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్ను అందిస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు నియోజకవర్గ ప్రజలకు ఇదొక సువర్ణ అవకాశం అని ఆధార్ కార్డ్ ,రెండు ఫోటోలు , జనన ధ్రువ పత్రం లేదా పదవ తరగతి మెమో జత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ నెల 4 మంగళవారం నుండి  13  గురువారం సాయంత్రం 4 గంటలలోపు దుబ్బాక ఎంపీ క్యాంపు కార్యాలయంలో (దుబ్బాక బస్ డిపో దగ్గర) దరఖాస్తును సమర్పించాలని, లైసెన్స్ ఫీజు తానే  చెల్లించి నియోజకవర్గ ప్రజలకు ఆర్టీవో కార్యాలయం నుండి ఉచితంగా లైసెన్సులు మంజూరు చేయిస్తానని తెలిపారు.