స్ఫూర్తి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

స్ఫూర్తి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

ముద్రప్రతినిధి,సిద్దిపేట:స్ఫూర్తి లయన్స్ క్లబ్ సిద్దిపేట నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మంగళ వారం జరిగింది. క్లబ్ అధ్యక్షులుగా సామల సత్యనారాయణ, సెక్రెటరీగా చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ గా దూడం రాజులతో ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్యాం కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ మామిడాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మామిడాల సత్యానందం,లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.