చిన్నారులపై ఉపాధ్యాయు నీ లైంగిక వేధింపులు

చిన్నారులపై ఉపాధ్యాయు నీ లైంగిక వేధింపులు

 గుండాల ఏప్రిల్ 08 (ముద్ర న్యూస్): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అండెం మాధవరెడ్డి కొంత కాలంగా గుండాల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు విద్యార్థులతో కలిసి మెలిసి బాలికలల తో అతివినయంగా ప్రవర్తిస్తూ ఆడ పిల్లలకు డబ్బులు అందిస్తూ రకరకాలుగా శరీర భాగాలను చేస్తూ ఇటీవల ఒంటి పూట బడి నడుస్తుండగా,ఈరోజు సోమవారం ఉదయం పాఠశాల నుండి బాలికలు ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు పిల్లలను మీకు ఎందుకు లేట్ అయింది,అని ఆరా తీయగా పాఠశాలలో జరిగిన విషయాలు తల్లిదండ్రులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో రాత పూర్వకంగా గ ఫిర్యాదు చేశారు స్థానిక ఎస్సై యాకన్న తెలిపిన వివరణ ప్రకారం గుండా ల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల కు పాల్పడుతున్నాడంటూ బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని విచారిస్తున్నామని తెలిపారు.