ఈ నెల 13 వరకు అసెంబ్లీ 10న ఓటాన్​ అకౌంట్​బడ్జెట్​

ఈ నెల 13 వరకు అసెంబ్లీ 10న ఓటాన్​ అకౌంట్​బడ్జెట్​

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 13 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్​సమావేశాలు గురువారం ఉదయం మొదలయ్యాయి. గవర్నర్​ తమిళి సౌందర్​రాజన్​ప్రసంగం తర్వాత అసెంబ్లీని వాయిదా వేశారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సీపీఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 13 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 10న బడ్జెట్​ ప్రవేశపెట్టి, 11న సెలవు ఇవ్వనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి 13 వరకు బడ్జెట్​పై చర్చలు, ఇతర అంశాలను కొనసాగించనున్నారు. 

ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 9, 10,12,13 తేదీల్లో నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.