తెలంగాణకు మరో అంతర్జాతీయ పరిశ్రమ

తెలంగాణకు మరో అంతర్జాతీయ పరిశ్రమ

తెలంగాణకు మరో అంతర్జాతీయ పరిశ్రమ వచ్చింది. ఫాక్స్​కాన్​ సంస్థ నిర్మాణానికి మంత్రి కేటీఆర్​ భూమి పూజ చేశారు. రూ. 1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్​ కాన్​ చైర్మన్​యాంగ్​లియా పాల్గొన్నారు. ఈ పరిశ్రమలో 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ  ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని అన్నారు. మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.  ఈ పరిశ్రమతో ఒప్పందం కుదిరిన రెండు నెలల్లోనే శంకుస్థాపన చేశామన్నారు. మొదటి దశలో 25 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. యువత కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.